From Wikipedia, the free encyclopedia


                      దేశమును ప్రేమించుమన్నా


దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్ !


పాడిపంటలుపొంగి పొర్లే

దారిలో నువు పాటు పడవోయ్

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !


ఈసురోమని మనుషులుంటే

దేశ మేగతి బాగుపడునోయ్

జల్డుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నించవోయ్ !


అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకులు నమ్మవెలె నోయ్

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్ !


వెనుక చూసిన కార్యమేమోయ్

మంచిగతమున కొంచమేనోయ్

మందగించక ముందు అడుగేయ్

వెనుక పడితే వెనుకేనోయ్ !


పూను స్పర్దను విద్యలందే

వైరములు వాణిజ్య మందే

వ్యర్ధ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్ !


దేశాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పకోకోయ్

పూని యేదైనాను, వొక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ !


ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసె నోయ్

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్ !


పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్ల లోయి !


సొంత లాభం కొంత మానుకు

పొరుగువాడికి తోడు పడవోయ్

దేశమంటే మట్టికాదోయి

దేశమంటే మనుషులోయ్ !


చెట్ట పట్టాల్ పట్టుకుని

దేశస్తు లంతా నడవవలె నోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవలె నోయి !


మతం వేరైతేను యేమోయి

మనసు వొకటై మనుషులుంటే

జాతియన్నది లేచి పెరిగీ

లోకమున రాణించు నోయి !


దేశ మనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలె నోయ్

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలె నోయి !


ఆకులందున అణగి మణగీ

కవిత పలకవలె నోయ్

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్త వలెనోయి !


రచన: గురజాడ అప్పారావు

From Wikipedia, the free encyclopedia


                      దేశమును ప్రేమించుమన్నా


దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

వట్టి మాటలు కట్టిపెట్టోయ్

గట్టి మేల్ తలపెట్టవోయ్ !


పాడిపంటలుపొంగి పొర్లే

దారిలో నువు పాటు పడవోయ్

తిండి కలిగితె కండ కలదోయ్

కండ కలవాడేను మనిషోయ్ !


ఈసురోమని మనుషులుంటే

దేశ మేగతి బాగుపడునోయ్

జల్డుకొని కళలెల్ల నేర్చుకు

దేశి సరుకులు నించవోయ్ !


అన్ని దేశాల్ క్రమ్మవలె నోయ్

దేశి సరుకులు నమ్మవెలె నోయ్

డబ్బు తేలేనట్టి నరులకు

కీర్తి సంపద లబ్బవోయ్ !


వెనుక చూసిన కార్యమేమోయ్

మంచిగతమున కొంచమేనోయ్

మందగించక ముందు అడుగేయ్

వెనుక పడితే వెనుకేనోయ్ !


పూను స్పర్దను విద్యలందే

వైరములు వాణిజ్య మందే

వ్యర్ధ కలహం పెంచబోకోయ్

కత్తి వైరం కాల్చవోయ్ !


దేశాభిమానము నాకు కద్దని

వట్టి గొప్పలు చెప్పకోకోయ్

పూని యేదైనాను, వొక మేల్

కూర్చి జనులకు చూపవోయ్ !


ఓర్వలేమి పిశాచి దేశం

మూలుగులు పీల్చేసె నోయ్

ఒరుల మేలుకు సంతసిస్తూ

ఐకమత్యం నేర్చవోయ్ !


పరుల కలిమికి పొర్లి యేడ్చే

పాపి కెక్కడ సుఖం కద్దోయ్

ఒకరి మేల్ తన మేలనెంచే

నేర్పరికి మేల్ కొల్ల లోయి !


సొంత లాభం కొంత మానుకు

పొరుగువాడికి తోడు పడవోయ్

దేశమంటే మట్టికాదోయి

దేశమంటే మనుషులోయ్ !


చెట్ట పట్టాల్ పట్టుకుని

దేశస్తు లంతా నడవవలె నోయ్

అన్నదమ్ముల వలెను జాతులు

మతములన్నీ మెలగవలె నోయి !


మతం వేరైతేను యేమోయి

మనసు వొకటై మనుషులుంటే

జాతియన్నది లేచి పెరిగీ

లోకమున రాణించు నోయి !


దేశ మనియెడి దొడ్డ వృక్షం

ప్రేమలను పూలెత్తవలె నోయ్

నరుల చెమటను తడిసి మూలం

ధనం పంటలు పండవలె నోయి !


ఆకులందున అణగి మణగీ

కవిత పలకవలె నోయ్

పలుకులను విని దేశమందభి

మానములు మొలకెత్త వలెనోయి !


రచన: గురజాడ అప్పారావు


Videos

Youtube | Vimeo | Bing

Websites

Google | Yahoo | Bing

Encyclopedia

Google | Yahoo | Bing

Facebook